ETV Bharat / bharat

Chandrababu to CID custody : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ కస్టడీకి చంద్రబాబు - ACB Court

Chandrababu_to_CID_custody
Chandrababu_to_CID_custody
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 2:53 PM IST

Updated : Sep 22, 2023, 10:31 PM IST

14:48 September 22

Chandrababu to CID custody రెండ్రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ కస్టడీకి చంద్రబాబు

Chandrababu to CID custody: ఏపీ నైపుణ్యాభివృద్ధి కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడ్ని రెండు రోజుల కస్టడీ, రిమాండ్‌కు అనుమతిస్తూ.. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల పాటు ఆయన్ని విచారించేందుకు సీఐడీకి అనుమతినిస్తూ.. ఏసీబీ కోర్టు న్యాయధికారి తీర్పునిచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య చంద్రబాబును ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం 5 వరకు విచారించాలని సూచించింది.

AP Skill Development Case Updates: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో.. తెలుగుదేశం అధినేత చంద్రబాబును రెండు రోజులపాటు సీఐడీ కస్టడీలో విచారించేందుకు అనుమతినిస్తూ.. ఏసీబీ కోర్టు న్యాయధికారి బి.సత్యవెంకట హిమబిందు తీర్పు వెలువరించారు. 5 రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ.. సీఐడీ ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్​పై చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు, సీఐడీ తరుఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. సీఐడీ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు తరుఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయధికారి తీర్పును వాయిదా వేసి.. ఈ మధ్యాహ్నం రెండున్నర తర్వాత తీర్పును ప్రకటించారు. చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఎలాంటి ఇబ్బందులూ లేని విధంగా విచారణ చేపట్టాలని సూచించారు.

TDP Leaders Protest in AP: చంద్రబాబు అరెస్టుపై భగ్గుమన్న ప్రజలు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు..

Investigation in Rajamahendravaram Jail: అయితే, చంద్రబాబు నాయుడ్ని రాజమహేంద్రవరం కారాగారంలో విచారిస్తారా..?, లేదా సీఐడీ కార్యాలయంలో విచారిస్తారా..?, లేక బయట మరేదైనా ప్రదేశంలో విచారిస్తారా..? అనే వివరాలను తెలియజేయాలని.. సీఐడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి, ప్రత్యేక పీపీ వివేకానందను అడిగారు. బయట విచారిస్తే NSG భద్రత తప్పనిసరిగా ఉంచాలని చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. ఐదు నిమిషాల్లో ఈ విషయంపై తేల్చాలని జడ్జి పేర్కొనడంతో.. రాజమహేంద్రవరం కారాగారమే అన్ని విధాలా సురక్షితమైదని.. సీఐడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. దీనికి సమ్మతించిన న్యాయాధికారి.. ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతించారు.

Every Hour..5 Minutes Break: అనంతరం విచారణ సమయంలో ప్రతి గంటకు.. 5 నిమిషాల పాటు విరామంతో పాటు.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు భోజన విరామం ఇవ్వాలని స్పష్టం చేశారు. చంద్రబాబు తరఫు న్యాయవాది ఎదుట విచారణ జరపాలని పేర్కొన్న న్యాయాధికారి.. విచారణలో ఎవరు పాల్గొనేదీ పేర్లు ఇవ్వాలని కోరారు. దాంతో 8 మంది పేర్లతో కూడిన జాబితాను చంద్రబాబు తరఫు న్యాయవాదులు అందజేశారు. దర్యాప్తు అధికారుల్లో ఎవరు విచారణకు హాజరయ్యేదీ వివరాలు తెలియజేయాలని కోరగా.. 12 మంది పేర్లతో కూడిన జాబితాను అందజేశారు.

TDP Leaders Protest Over Remand For CBN: చంద్రబాబు కోర్టు రిమాండ్​పై ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల రాస్తారోకోలు..

Video and Photos Should be Submitted in a Sealed Envelope: ఈ నేపథ్యంలో విచారణ అధికారి ఒక్కరికే వీడియో చిత్రీకరణకు న్యాయాధికారి అనుమతించారు. విచారణ సమయంలో తీసిన వీడియో దృశ్యాలు, ఫోటోలు సీల్డు కవరులో మాత్రమే సమర్పించాలని.. వేటినీ బహిరంగపరచరాదని స్పష్టం చేశారు. విచారణ అంశాలు బయటకు వెల్లడించరాదని ఆదేశించారు. వయసు రీత్యా విచారణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విచారణ సమయంలో శారీర, మానసిక ఒత్తిడికి గురిచేయరాదని, విచారణ ముందు, తర్వాత, వైద్యపరీక్షలు నిర్వహించాలని.. ఇందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఈ నెల 24తో రిమాండ్‌ ముగియనున్నందున.. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు విచారణ ముగిసిన తర్వాత.. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో న్యాయాధికారి ఎదుట హాజరుపర్చాలన్నారు. చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని.. న్యాయాధికారి హిమబిందు స్పష్టం చేశారు.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తమ నిర్ణయాన్ని మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వెల్లడిస్తుందనే సమాచారంతో ఏసీబీ కోర్టు జడ్జి.. ఉదయం పదిన్నరకు ప్రకటిస్తానని పేర్కొన్న కస్టడీ పిటిషన్‌పై నిర్ణయాన్ని.. మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకుముందు.. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును వీడియో లింకేజి ద్వారా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారించారు.

Chandrababu Spoke to the ACB Court Judge: చంద్రబాబు.. తన బాధ, ఆవేదనను న్యాయమూర్తికి తెలిపారు. జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వివరించారు. తన హక్కులను రక్షించాలని... న్యాయాన్ని కాపాడాలని కోరారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం తనదని.. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని చెప్పారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందని.. అన్యాయంగా అరెస్టు చేశారని... న్యాయమూర్తికి చెప్పారు. ఇది తన బాధ, ఆవేదన, ఆక్రందన అన్న చంద్రబాబు... తనకు పెద్ద పనిష్‌మెంట్‌ ఇచ్చారని పేర్కొన్నారు. తనపై ఉన్నవి ఆరోపణలు మాత్రమేనని.. అవి నిర్ధారణ కాలేదని చంద్రబాబు తెలిపారు. చట్టం ముందు అంతా సమానమేనని, చట్టాన్ని తాను గౌరవిస్తానన్నారు. న్యాయం గెలవాలని న్యాయమూర్తితో అన్నారు.

ACB Court Judge Spoke to Chandrababu: అనంతరం చంద్రబాబుతో మాట్లాడిన న్యాయమూర్తి... పోలీసు కస్టడీలో లేరని... జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున... దీన్ని శిక్షగా భావించొద్దని అన్నారు. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే.., నేరనిరూపణ కాలేదని... చట్టం, నిబంధనల ప్రకారమే రిమాండ్‌ విధించామని తెలిపారు. జైలులో సౌకర్యాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు. సౌకర్యాలు అవసరమైతే... దానికి అనుగుణంగా ఆదేశిస్తామన్నారు. ఈ నెల 24 వరకు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారని తెలిపారు. సీఐడీ మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని అడుగుతోందని... మీ తరఫు న్యాయవాదులు కస్టడీ అవసరం లేదని వాదించారని... చట్టం ముందు అంతా సమానమేనని... న్యాయమూర్తి చంద్రబాబుతో చెప్పారు.

TDP Leaders Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ నిరసన జ్వాలలు.. పలుచోట్ల ఉద్రిక్తత

Last Updated : Sep 22, 2023, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.