ETV Bharat / bharat

భక్తుడికి బంపర్​ ఆఫర్​.. ప్రసాదం కోసం వెళ్తే చేతిలో రూ.లక్షలు! - కర్ణాటక న్యూస్

కర్ణాటక చామరాజనగర్​లో ఓ అధికారి తప్పిదం తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారి ప్రసాదానికి బదులుగా పొరపాటున రూ.2.91లక్షలు ఉన్న బ్యాగును ఇచ్చాడు.

karnataka latest news
karnataka latest news
author img

By

Published : Jul 29, 2022, 10:27 PM IST

ఆ ఆలయానికి భారీ ఎత్తున పోటెత్తిన భక్తులు దర్శనం ముగించుకుని కౌంటర్​ వద్ద ప్రసాదం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాకిడి అధికమవడం వల్ల హడావుడిలో ఉన్న అధికారి లడ్డుకి బదులు రూ. 2.91 లక్షలు ఉన్న బ్యాగును భక్తుడికి ఇచ్చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చామరాజనగర్​లో జరిగింది.

ఇదీ జరిగింది: హనుర్​ తాలుకాలోని మలిమహాదేశ్వర్​ కొండపై ఉన్న గుడికి అమవాస్య సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్శనం వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారి.. లడ్డు ప్రసాదంతో పాటు పొరపాటున రూ. 2.91 లక్షల బ్యాగును భక్తుడికి అందజేశారు. ఆ తర్వాత తేరుకున్న అధికారి చూడగా డబ్బుల బ్యాగు కనిపించలేదు. బ్యాగు కోసం ఎంత వెతికినా జాడ లేదు. చివరకు సీసీటీవీ కెమెరాను పరిశీలించగా.. పొరపాటున భక్తుడికి ఇచ్చిన విషయం బయటపడింది. ఈ డబ్బు దేవస్థానానికి సంబంధించినదని.. ఖాతాలో జమ చేయడానికి తీయగా ఇలా జరిగిందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి: 'నోరు జారా.. క్షమించండి'.. రాష్ట్రపతి ద్రౌపదికి అధీర్ రంజన్​ లేఖ

'ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి సెలవులు!'.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.