Porbandar Ship Sank: గుజరాత్‌లోని పోర్ బందర్ నుంచి యూఏఈకి బయల్దేరిన ఓ ఓడ.. భారీ వర్షం, గాలి కారణంగా అరేబియా సముద్రంలో మునిగిపోయింది. ఎంటీ గ్లోబల్ కింగ్ అనే వాహన నౌక నుంచి ప్రమాద హెచ్చరిక అందిన తర్వాత.. 22 మంది క్రూ సభ్యుల్ని రక్షించింది ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ). ఈ మేరకు ఐసీజీ ఓ ప్రకటన విడుదల చేసింది.
పోర్ బందర్ తీరం నుంచి యూఏఈకి పెద్ద ఓడలో 6000 టన్నుల తారు తరలిస్తుండగా మునిగిపోయింది. అందులో 22 మంది ఉన్నారు. దీంతో అప్రమత్తమైన ఐసీజీ.. అత్యాధునిక ఏఎల్‌హెచ్ ధ్రువ్ ఛాపర్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.
ఇవీ చూడండి: ఠాక్రేపై 'ఆటో- మెర్సిడెస్' పంచ్.. డ్రమ్స్ వాయిస్తూ శిందేకు భార్య స్వాగతం
'నుపుర్ తల తెచ్చిస్తే ఇల్లు రాసిస్తా'.. మత గురువు ప్రకటన.. నిందితుడు అరెస్ట్