ETV Bharat / bharat

అర కోటి లంచం తీసుకుంటూ చిక్కిన ఏఎస్​ఐ

author img

By

Published : Jan 1, 2021, 6:10 PM IST

రూ.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ ఏఎస్​ఐ. గుజరాత్​లోని ఆనంద్​ నగరంలో ఈ ఘటన జరిగింది.

50 లక్షలు లంచం తీసుకుంటూ ఆనంద్​లో పోలీసు పట్టివేత
A Police constable caught red-handed taking a bribe of 50 lakhs in Anand.

గుజరాత్​లో రూ.50 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు ప్రకాశ్​ సిన్హ్ రౌల్ అనే ఏఎస్​ఐ. కంభట్ ఎరువుల కుంభకోణంలో బాధితుని పేరు ఎఫ్ఐఆర్​లో నమోదు చేయకుండా ఉండడానికి బదులుగా ఈ మేరకు లంచం తీసుకున్నాడని అధికారులు వెల్లడించారు.

కంభట్​ ఎరువుల కుంభకోణం..

ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చే యూరియాను ఆనంద్ నగరం, కంభట్​ ప్రాంత పారిశ్రామిక వాడలోని గోదాముల్లో దుండగులు అక్రమంగా నిల్వచేస్తున్నారు. అటు నుంచి ప్రైవేట్​ మార్కెట్​లో అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రకాశ్​ సిన్హ్.. గోదాముల్లో తనిఖీలు చేశారు. 1060 యూరియా బస్తాలను, నాట్లు వేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో గోడౌన్​ యజమాని పేరు నమోదు చేయలేదు. ఎఫ్​ఐఆర్​లో పేరు నమోదు చేయకుండా ఉండడానికి బదులుగా రూ.50 లక్షలను డిమాండ్​ చేశాడు.

మాటువేసి మరి..

గురువారం రాత్రి ఓ రెస్టారెంట్​లో గోడౌన్​ యజమాని నుంచి లంచం తీసుకోవడానికి ప్రణాళిక వేసుకున్నాడు ఏఎస్​ఐ. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని ఆ యజమాని.. ఏసీబీకి విషయాన్ని తెలియజేశాడు. ముం​దే అక్కడ కాపుగాసిన ఏసీబీ అధికారులు..సదరు ఏఎస్ఐ లంచం తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నేరాన్ని నిందితుడు అంగీకరించాడు.

ప్రకాశ్​పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు..దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పెద్ద మొత్తంలో అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:చట్టం సద్వినియోగం అయ్యేదెలా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.