హిందూ ముస్లిం భాయిభాయి అనేందుకు నిదర్శనంగా కర్ణాటకలోని ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఓ ముస్లిం నేత హిందూ ఆచారాల ప్రకారం 30 జంటలకు వివాహం జరిపించారు. వర్గాలకు అతీతంగా ఈ పెళ్లిళ్లు జరగడం విశేషం. హిందూ ఆచారాల ప్రకారం జరిపించిన ఈ పెళ్లి వేడుకలుకు వివిధ వర్గాలకు చెందిన జంటలు వేదిక మీదకు చేరి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
![mass Marriage program in karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-01-30-mass-marriage-kushtagi-kac-10028_30112022164153_3011f_1669806713_145_3011newsroom_1669818274_608.jpg)
కర్ణాటక కొప్పాల్లోని ముస్లిం వర్గానికి చెందిన వాజిర్ అలి హోనల్ అనే వ్యక్తి.. ఆ ప్రాంతంలోని బన్నీ మహంకాళి ఆలయంలో బుధవారం హిందూ సాంప్రదాయాల ప్రకారం బుధవారం ఈ వివాహాలు జరిపించారు. మొత్తం 30 జంటలు ఈ సందర్భంగా ఒక్కటయ్యారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. గత కొన్నేళ్లుగా ఇదే ఆలయంలో కొన్ని వందల జంటలను ఒక్కటి చేసిన వాజిర్.. ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.
![mass Marriage program in karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-01-30-mass-marriage-kushtagi-kac-10028_30112022164153_3011f_1669806713_703_3011newsroom_1669818274_358.jpg)
![mass Marriage program in karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-01-30-mass-marriage-kushtagi-kac-10028_30112022164153_3011f_1669806713_511_3011newsroom_1669818274_390.jpg)