ETV Bharat / bharat

తోపుడు బండి వ్యాపారికి ఇద్దరు బాడీగార్డ్స్​.. AK47లతో సెక్యూరిటీ.. ఎందుకంటే..

Clothes sellsman with bodyguards: ఉత్తర్​ప్రదేశ్​ ఎటా జిల్లాలో తోపుడు బండిపై బట్టలు అమ్ముకునే వ్యక్తికి భద్రతగా ఇద్దరు బాడీగార్డ్స్​ ఉన్నారు. ఇలా ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే!

clothes salesman with bodygaurds
clothes salesman with bodygaurds
author img

By

Published : Jul 19, 2022, 2:01 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఎటా జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. ఓ తోపుడు బండిపై బట్టలు అమ్ముకునే వ్యక్తికి ఇద్దరు బాడీగార్డ్స్​ ఉన్నారు. వ్యాపారి రామేశ్వర్​ బట్టలు అమ్ముతుండగా.. ఇద్దరు బాడీగార్డ్స్ ఏకే 47 తుపాకులతో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. దీంతో బట్టలు కొనడానికి వచ్చిన వినియోగదారులు.. రామేశ్వర్​ బాడీగార్డ్స్​ను చూసి ఆశ్చర్యపోతున్నారు.

clothes salesman with bodygaurds
బాడీగార్డ్స్​తో రామేశ్వర్​
clothes salesman with bodygaurds
బాడీగార్డ్స్​తో రామేశ్వర్​

ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్ దయాల్​ తోపుడు బండిపై బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్​ సోదరుడు జుగేంద్ర సింగ్​ను కలిశారు. ఈక్రమంలోనే వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో జుగేంద్ర సింగ్​.. తనను కులం పేరుతో దూషించారని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు దయాల్. దీనిపై జుగేంద్ర సింగ్​ హైకోర్టుకు వెళ్లారు. రామేశ్వర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని.. ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరారు. ఈ క్రమంలోనే రామేశ్వర్​ దయాల్​ను శనివారం కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. కోర్టుకు వచ్చిన దయాల్​ను చూసిన న్యాయమూర్తి.. ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. బాధితుడికి ఇద్దరు బాడీగార్డ్స్​ను భద్రతగా నియమించాలని ఆదేశించారు.

ఇవీ చదవండి: నీట్​ 'లోదుస్తుల' రగడపై ఎన్​టీఏ కీలక వ్యాఖ్యలు.. కేంద్రానికి కేరళ లేఖ

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 'ఆళ్వా' నామినేషన్​.. వెంటవచ్చిన పవార్​, రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.