ETV Bharat / bharat

గ్రామ సహాయకునితో  కాళ్లు మొక్కించుకున్న అగ్రకులస్థుడు

జైలుకెళ్లిన తన కొడుకును విడిపించుకునేందుకు గ్రామంలోని అగ్రకులస్థులందరి కాళ్లు మొక్కాలంటూ షరతు విధిస్తాడు విలన్. దీనితో విధిలేక అందరి కాళ్లమీద పడతాడు హీరో. నారప్ప సినిమాలోని ఈ సీన్ సినిమాకే హైలెట్​గా నిలిచింది. అయితే ఇదే​ తరహాలో తమిళనాడులో జరిగిన ఓ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది.

Dalit
విధులకు ఆటంకం కలిగించి.. కాళ్లు మొక్కించుకుని
author img

By

Published : Aug 7, 2021, 8:14 PM IST

విధులకు ఆటంకం కలిగించి.. కాళ్లు మొక్కించుకున్న అగ్రకులస్థుడు

ప్రభుత్వాధికారి విధులకు ఆటంకం కలిగిస్తున్న వ్యక్తిని అడ్డుకున్నందుకు దళిత గ్రామ సహాయకునితో అగ్రకులస్థుడు కాళ్లు మొక్కించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనను క్షమించాలంటే కాళ్లమీద పడాల్సిందేనని షరతు విధించాడు ఆ వ్యక్తి. తమిళనాడులోని కోయంబత్తూర్​లో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

జరిగింది ఇదీ..

కలైసెల్వి అనే మహిళ కోయంబత్తూరు జిల్లా అన్నూర్‌లోని ఒట్టర్‌పాలయం గ్రామంలో వీఏఓగా విధులు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన ముత్తుసామి ఆమెకు సహాయకుడిగా పని చేస్తున్నాడు. కోబ్రాసిపురం గ్రామానికి చెందిన గోపీనాథ్ అనే అగ్రకులానికి చెందిన వ్యక్తి తన ఆస్తి ధ్రువీకరణ పత్రాల కోసం పంచాయతీ కార్యాలయానికి వచ్చాడు. అయితే ఈ ప్రక్రియకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని ఆ తరువాతే కార్యాలయానికి రావాలని కలైసెల్వి అతనికి సూచించింది.

Dalit
కాళ్లు మొక్కుతున్న ముత్తుసామి

తప్పనిసరి పరిస్థుతుల్లోనే..

కలైసెల్విని పట్టించుకోని గోపీనాథ్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగక బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ముత్తుసామి అతన్ని అడ్డుకున్నాడు. ఒక మహిళా అధికారితో అమర్యాదగా ప్రవర్తించొద్దని సూచించాడు. దీంతో కోపోద్రిక్తుడైన గోపీనాథ్ ముత్తుసామిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించాడు. ముత్తుసామితో పాటు అతని గ్రామాన్ని వదిలిపెట్టనని బెదిరించాడు. అంతేగాక అతని కులాన్ని కించపరుస్తూ దూషించాడు. దీనితో భయపడిన ముత్తుసామి గోపీనాథ్ కాళ్లపై పడి క్షమాపణలు చెప్పాడు.

Dalit
కాళ్లు మొక్కుతూ ఏడుస్తున్న ముత్తుసామి

ఈ ఘటనపై కలైసెల్విని వివరణ కోరగా.. ఇది కులానికి సంబంధించిన గొడవ కాదని తెలిపారు.

"గోపీనాథ్ అనే వ్యక్తి మొదటిసారిగా ఈ కార్యాలయానికి వచ్చారు. అతను అరుస్తుంటే ముత్తుసామి అడ్డుకున్నాడు. వారిద్దరి మధ్య వాదన జరిగింది. గోపీనాథ్ ముత్తుసామిని బెదిరించాడు. దీనితో ముత్తుసామి భయపడి గోపీనాథ్ కాళ్లపై పడ్డాడు. దీనిపై ఫిర్యాదు చేస్తాడో లేదో నాకు తెలియదు."

-కలైసెల్వి, వీఓఏ

అయితే వీడియోలో మాత్రం.. గోపీనాథ్ అనే వ్యక్తి 'నేను ముత్తును క్షమించాను.. ఇందులో నా తప్పు కూడా ఉంది' అంటూ వ్యాఖ్యానించడం వినవచ్చు.

ఇక.. విలేజ్ అసిస్టెంట్ వ్యక్తి కాళ్లపై పడిన వీడియోను చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని వీడియో ద్వారా తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.