మహారాష్ట్రలోని పుణెలో అమానవీయ ఘటన జరిగింది. ఓ ఐదేళ్ల చిన్నారిపై 67 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ జరిగింది..
బాధితురాలి ఇంటి పక్కనే నివాసం ఉండే నిందితుడు.. ఈనెల 21న చిన్నారిని సమీపంలోని ఓ గిడ్డంగికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి : 'అల్లుడు మరణిస్తే.. పరిహారానికి అత్త కూడా అర్హురాలే'