ETV Bharat / bharat

89 ఏళ్ల వయసులో శృంగార వేధింపులు.. భర్తపై ఫిర్యాదు చేసిన భార్య.. - Minor girl gang raped by three

శృంగారం కోసం తన భర్త పదేపదే వేధిస్తున్నాడని ఓ వృద్ధురాలు హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ఆ బృందం.. ఈ వృద్ధ దంపతులకు ఓ మార్గాన్ని చూపింది. అప్పటినుంచి ఆ వృద్ధురాలికి అతని నుంచి వేధింపులు తగ్గాయని వృద్ధురాలు తెలిపింది. ఛత్తీస్​గఢ్​లో ఓ మైనర్​ పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు

87-year-old woman calls Abhyam helpline
87-year-old woman calls Abhyam helpline
author img

By

Published : Sep 13, 2022, 10:29 AM IST

Updated : Sep 13, 2022, 11:56 AM IST

old woman calls Abhyam helpline : గుజరాత్‌లోని మహిళల కోసం '181 అభయం' పేరుతో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ ఏర్పాటైంది. ఈ నెంబర్​కు ఇటీవలే ఓ విన్నూత్నమైన కాల్​ వచ్చింది. అది ఓ వృద్ధురాలి వద్ద నుంచి. వదోదరకు చెందిన ఆమె చెప్పిన విషయం తెలిస్తే అందరూ షాక్​ అవ్వాల్సిందే అని అంటున్నారు ఆ హెల్ప్​లైన్​ నిర్వాహకులు. 87 వయసుగుల తన భర్త ఆమెను సెక్స్‌ కోసం తీవ్ర స్థాయిలో వేధిస్తున్నాడని, నిరాకరిస్తున్నందుకు తనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడని వాపోయింది. అనారోగ్యంతో ఉన్నానని, అలసటగా ఉందని చెబుతున్నప్పటికీ ఆయన పట్టించుకోవడంలేదని పేర్కొంది.

ఇది విన్న 'అభయం' బృందం ఆ వృద్ధ జంట ఇంటికి చేరుకుని వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చింది. యోగాను అభ్యసించాలని, మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని వృద్ధునికి సూచించింది. ఆలోచనలను ఇతర అంశాలపైకి మళ్లించేందుకు సీనియర్‌ సిటిజన్ల గార్డెన్లు, పార్కులను సందర్శించాలని హితవు పలికింది. మొత్తంమీద ఈ సూచనలు పనిచేశాయని సమాచారం.

ఛత్తీస్​గఢ్​లో దారుణం:
ఛత్తీస్​గఢ్​లోని నందగావ్​ జిల్లా బసంత్​పూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ దారుణం జరిగింది. సెప్టంబర్​ 10న ఓ మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. పనికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆ బాలికను అపహరించి మరో ఇద్దరితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోక్సో కింద వారిపై కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: బాలుడిపై విరుచుకుపడ్డ వీధి కుక్క.. కాళ్లు, చేతులు కొరికి...

దేశవ్యాప్తంగా 60 ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు.. ఆ గ్యాంగ్​స్టర్లే టార్గెట్!

Last Updated : Sep 13, 2022, 11:56 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.