ETV Bharat / bharat

ఇంట్లోకి దూరి 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. మహిళపై ప్రభుత్వ ఉద్యోగి రేప్​ - మహిళపై అత్యాచారం చేసి ప్రభుత్వ ఉద్యోగి

85 ఏళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. తాను మాంత్రికుడినని మాయమాటలు చెప్పి మహిళపై అత్యాచారం చేశాడో ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఘటన జమ్ముకశ్మీర్​లో జరిగింది. మరోవైపు, రాజస్థాన్​లో ఇంటర్​ పరీక్షకు హాజరై తిరిగి వస్తున్న 17 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్​ చేసి.. అత్యాచారం చేశారు దుండగులు.

85 Years Old Woman Raped
85 Years Old Woman Raped in Hamirpur uttarpradesh
author img

By

Published : Apr 25, 2023, 7:18 AM IST

Updated : Apr 25, 2023, 8:47 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న 85 ఏళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారనికి పాల్పడ్డాడు. బాధితురాలు ఎంత బతిమాలినా.. కనికరం చూపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హమీర్​పుర్​ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. బిన్వార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో ఓ 85 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె కుమారుడు ఉపాధి కోసం దిల్లీ వెళ్లి.. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. అదే గ్రామానికి చెందిన భూర శివరే అని వ్యక్తి.. బాధితురాలి ఇంటి వెనుక నుంచి దొంగతనంగా వచ్చి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఎంత బతిమాలినా వినలేదు. తర్వాతి రోజు ఉదయం ఈ విషయం తెలుసుకున్న స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి.. బాధితురాలిని పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లారు. వృద్ధురాలి ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అయితే, నిందితుడిపై ఇదివరకే పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు.

మాంత్రికుడినని మహిళపై అత్యాచారం..
మాంత్రికుడినని మాయమాటలు చెప్పి.. ఓ మహిళపై అత్యాచారం చేశాడో ప్రభుత్వ ఉద్యోగి. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్​లోని సాంబా జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్​గఢ్​ ప్రాంతంలో నివసించే నిందితుడు.. జల్​ శక్తి విభాగంలో పని చేస్తున్నాడు. ఇతడికి ఓ ఆలయంలో.. మధ్య వయస్కురాలైన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. తనకు అతీంద్రీయ శక్తులు ఉన్నాయని.. ఆ మహిళను నమ్మించాడు నిందితుడు. ఆ విద్యలతో ఆమె చర్మ వ్యాధులు నయం చేస్తానని.. బాధితురాలిని తన ఇంటికి పిలిచాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు సదరు మహిళ జిల్లా చీఫ్​ జుడీషియల్​ మేజిస్ట్రేట్​ కోర్టులో కేసు ఫైల్​ చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. జిల్లాలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడమే తమ ప్రాధాన్యమని ఎస్పీ బెనమ్ తోశ్​ అన్నారు.

అమ్మాయి కిడ్నాప్​.. అనంతరం రేప్​..
17 ఏళ్ల అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు అపహరించారు. అంనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన రాజస్థాన్​లోని దుంగార్​పుర్​ జిల్లాలో సోమవారం జరిగింది.

పోలీలుసులు తెలిపిన సమాచారం ప్రకారం.. దోవ్డా పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల అమ్మాయి.. 11వ తరగతి పరీక్షకు హాజరై ఇంటికి తిరిగివస్తోంది. ఆ సమయంలో ఆమెను వెంబడించిన ఇద్దరు వ్యక్తులు.. కిడ్నాప్​ చేశారు. అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారి కోసం గాలింపు చేపట్టారు. అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Apr 25, 2023, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.