మరో ప్రపంచ రికార్డును ముద్దాడేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది. వరుసగా ఐదో సంవత్సరం కూడా రామ్‌కీ పౌడీ ఘాట్‌లో దీపోత్సవ కార్యక్రమాన్ని(ayodhya deepotsav 2021) ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిసోంది. ఘాట్‌లో మొత్తం 7లక్షల 50వేల దీపాలతో పాటు, అయోధ్య పట్టణమంతటా దివ్వెలు వెలిగించే కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు(ayodhya diwali 2021). రామ్‌కీ పౌడీ ఘాట్‌లో దీపాలు వెలుగులకు సంబంధించి మొత్తం 12వేల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. అయోధ్యతోపాటు యావత్ ప్రపంచానికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ ప్రయత్నం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా సరయు నదీతీరంలో అయోధ్య చరిత్రను తెలిపే లేజర్ షోలు నిర్వహిస్తున్నారు. అటు దీపోత్సవంతో(ayodhya deepotsav news) పాటు రామమందిరం, నగరంలోని ఇతర ప్రదేశాల ఇతివృత్తాలు తెలిపేలా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అత్యంత వైభవంగా జరిగే దీపోత్సవం కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయోధ్య సహా యూపీ నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఇప్పటికే దీపోత్సవానికి(ayodhya diwali 2021) సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు చెప్పారు. సూర్యుడి అస్తమయం అనంతరం అయోధ్య నగరం దీప కాంతులతో వెలుగొందనున్నట్లు పేర్కొన్నారు.
దీపోత్సవం కోసం అయోధ్య(ayodhya news) ఎంత సుందరంగా ముస్తాబయిందో ఈ ఫొటోల్లో చూడండి.
ఇదీ చదవండి: అయోధ్యలో ఇసుకతో రామాయణం చెప్పిన సైకతశిల్పి