ETV Bharat / bharat

అప్పు చెల్లించలేదని దారుణం.. మైనర్​పై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. బాలికకు గర్భం - Two killed in avalanche in Jammu and Kashmir

మైనర్​పై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని బాలికను బెదిరించి ఆ దారుణానికి ఒడిగట్టాడు. మరోవైపు 13 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తొమ్మిది నెలల క్రితం ఓ మైనర్​తో పాటు మరో ముగ్గురు బాలికపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ రెండు ఘటనలు చత్తీస్​గఢ్​లోనే జరిగాయి.

60-year-old-man-raped-minor-for-non-payment-of-debt-in-chhattisgarh
అప్పు చెల్లించలేదని మైనర్​పై వృద్ధుడు అత్యాచారం
author img

By

Published : Jan 29, 2023, 10:54 PM IST

అప్పు చెల్లించలేదని మైనర్​పై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. మూడు నెలలుగా ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో సదరు బాలిక గర్భం దాల్చింది. అనంతరం విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఛత్తీస్​గఢ్​ జిల్లాలోని ధమ్​తరి జిల్లాలో ఈ ఘోరం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కురుద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇంటి పక్కనే నివాసం ఉండే 60 ఏళ్ల వృద్ధుడి నుంచి బాధితురాలి తల్లి 2022 అక్టోబర్​ నెలలో 5వేల రూపాయల అప్పు తీసుకుంది. అప్పటి నుంచి ఆ వృద్ధుడు చిన్నారిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చగా.. బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించినట్లు తెలిపారు.

బిడ్డకు జన్మనిచ్చిన మైనర్​..
13 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 9 నెలల క్రితం బాధితురాలు సామూహిక అత్యాచారానికి గురైంది. ఓ మైనర్​తో సహా మరో ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఛత్తీస్​గఢ్​లో ఈ దారుణం జరిగింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

"తొమ్మిది నెలల క్రితం మైనర్​ బాలికను ఓ ముగ్గురు వ్యక్తులు బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఆమెను బెదిరించి అత్యాచారం చేశారు. ఎవరికైనా చంపేస్తామని హెచ్చరించారు. దీంతో విషయాన్ని బాలిక ఎవ్వరితో చెప్పలేదు. కొద్ది రోజుల క్రితం కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను.. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది" అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మంచుచరియలు విరిగిపడి ఇద్దరు మృతి..
జమ్ముకశ్మీర్​లో మంచుచరియలు విరిగిపడి ఓ మహిళ, బాలిక మృతి చెందారు. లద్దాఖ్‌లోని కార్గిల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తంగోల్ గ్రామం సమీపంలో కార్గిల్-జన్స్కార్ హైవేపై వీరిద్దరు నడుచుకుంటు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా మంచుచరియలు విరిగిపడి వీరి మీద పడ్డాయి. వెంటనే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టినప్పటికి ఫలితం లేకపోయింది. ఘటన స్థలంలోనే వారిద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను బిల్కిస్ బానో (25), కుల్సుమ్ బి (14)గా పోలీసులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాలను వెలికితీసి చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులుకు మృతదేహాలు అందించినట్లు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.