ఉత్తర్ప్రదేశ్ గాజీపుర్లోని మొహమ్మదాబాద్ కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఓ కొట్టు వద్ద మాట్లాడుకుంటున్న జనంపైకి వేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.



విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
