ETV Bharat / bharat

'సోషల్​ మీడియాలో వచ్చిందే వాస్తవం'.. 87% భారతీయుల్లో ఇదే వైఖరి - ఆక్స్​ఫర్డ్ సోషల్​ మీడియా సర్వే

పుస్తకాలు, పత్రికల కన్నా సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్నే ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారని ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్​ సర్వే వెల్లడించింది. భారత్​లో 87శాతం మంది సోషల్​ మీడియాలో వచ్చిన సమాచారాన్నే నమ్ముతున్నారని పేర్కొంది.

oxford social media study
oxford social media study
author img

By

Published : Jun 29, 2022, 6:53 AM IST

సాధారణంగా ఏ విషయంపైనైనా వాస్తవ సమాచారం తెలుసుకోవాలంటే పుస్తకాలు, పత్రికలు లేదా ఇతర సంప్రదాయ మార్గాలపై ఆధారపడతాం. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, సామాజిక మాధ్యమాల్లోనే సమాచారాన్ని ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారని తాజా అంతర్జాతీయ సర్వే పేర్కొంది. ముఖ్యంగా భారత్‌లో ఈ సంఖ్య అధికంగా ఉందని వెల్లడించింది. భారత్‌లో కచ్చితమైన సమాచారం తెలుసుకొనేందుకు, తమకు తెలిసిన విషయాన్ని రూఢీ చేసుకొనేందుకు 54% మంది ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లనే ఆశ్రయిస్తున్నారు. ఈ శాతం మెక్సికో, దక్షిణాఫ్రికాలో 43%గా ఉంది. బ్రిటన్‌లో మాత్రం ఇది కేవలం 16 శాతమే ఉండటం గమనార్హం. ఈ సర్వేను భారత్‌, మెక్సికో, దక్షిణాఫ్రికా, అమెరికా, యూకేల్లో ‘ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌’ నిర్వహించింది. మిగతా దేశాలతో పోలిస్తే సామాజిక మాధ్యమాల్లో తాము చదివిన, పంచుకున్న సమాచారం నిజమేనని 87% భారతీయులు నమ్మడం విశేషం.

ఇంకా సర్వే ఏం చెప్పిందంటే..

  • సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా 67% మంది గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌పై ఆధారపడుతున్నారు.
  • నిజానిజాల నిర్ధారణకు 52 శాతం మంది ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
  • పుస్తకాలు, ఇతర సంప్రదాయపద్దతుల ద్వారా వాస్తవాలను రూఢీ చేసుకోవడం తగ్గిపోతోంది.
  • ముఖ్యంగా యువకులు సామాజిక మాధ్యమాల్లో వచ్చిందే నిజమని నమ్ముతున్నారు. 25 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉన్నవారు 44 శాతం మంది తాము ఎక్కువగా సోషల్‌ మీడియానే నమ్ముతామని తెలిపారు.
  • భారత్‌లో 30 శాతం మంది తల్లిదండ్రులైతే తమ చిన్నారులకు ఏదైనా విషయం వివరించేటప్పుడు వాట్సప్‌.. తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చిన అంశాలనే ఉదాహరణలుగా చూపుతున్నారు.

ఇదీ చదవండి: తల నరికి యువకుడి హత్య.. నుపుర్ శర్మకు మద్దతు తెలపడమే కారణం.. మోదీకి వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.