ETV Bharat / bharat

పెగసస్​పై సీజేఐ జోక్యం కోరుతూ.. 500 మంది లేఖ - పెగసస్​పై సీజేఐకు లేఖ

పెగసస్ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని సీజేఐ ఎన్​.వి రమణను కోరుతూ లేఖ రాశారు 500 మంది వ్యక్తులు, సంస్థలు. ​భారత్​లో దాని విక్రయంపై మారటోరియం విధించాలని కోరారు.

Justice Ramana
జస్టిస్​ ఎన్​వీ రమణ
author img

By

Published : Jul 30, 2021, 3:22 AM IST

పెగసస్ నిఘా వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి రమణకు 500 మందికి పైగా వ్యక్తులు, సంస్థలు లేఖ రాశాయి. ఇజ్రాయెల్​ సంస్థ ఎన్​ఎస్​ఓకు చెందిన ఈ స్పైవేర్​ను భారత్​లో విక్రయం, బదిలీ, వినియోగంపై మారటోరియం విధించాలని విజ్ఞప్తి చేశాయి.

మహిళా విద్యార్థిణులు, విద్యావేత్తలు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలు, లాయర్లు, లైంగిక హింస బాధితులపై నిఘా కోసం స్పైవేర్​ను వినియోగించారనే కథానాలపై వారు విస్మయం వ్యక్తంచేశారు. లింగ భేదాల్లేని, సమాచార భద్రత, వ్యక్తిగత గోపత్య విధానాన్ని అనుసరించాలని కోరారు.

చీఫ్​ జస్టిస్ రంజన్ గొగొయ్​పై లైంగిక ఆరోపణలు చేసిన వ్యక్తిపై ఈ సాఫ్ట్​వేర్​ ద్వారా నిఘా ఉంచారనే ఆరోపణలను కూడా ఈ లేఖలో ప్రస్తావించారు.

"పెగసస్​ అనేది మహిళలకు సంబంధించి తీవ్ర ఆందోళనకరమైనది. ప్రభుత్వం, అధికారంలో ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడితే నిఘా ఉంటుందనే భయం వారిని వెంటాడుతుంది. మానవ హక్కుల కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రభుత్వ సైబర్​ దాడులు.. లైంగిక వేధింపుల బాధితులనూ వదల్లేదు. ఇది సొంత ప్రజలపై ప్రభుత్వం చేస్తున్న దాడి." అని పేర్కొన్నారు.

ఈ లేఖపై అరుణ రాయ్, అంజలి భరద్వాజ్, హర్ష్​ మందర్ సహా ఇతర కార్యకర్తలు, విద్యావేత్తలు, వ్రిందా గ్రోవర్, ఝుమా సేన్ లాంటి న్యాయవాదులు సంతకాలు చేశారు.

ఇదీ చూడండి: పెగసస్​పై కేంద్రం, రాహుల్ మధ్య మాటల యుద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.