ETV Bharat / bharat

'మహా' డిప్యూటీ స్పీకర్​కు​ శిందే లేఖ.. శాసనపక్ష హోదాకు వినతి

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార శివసేనపై తిరుగుబావుట ఎగురవేసిన ఏక్​నాథ్​ శిందే.. శాసనపక్ష హోదా కల్పించాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్​, గవర్నర్​లకు లేఖ రాశారు. 36 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన కాపీలను పంపించారు. మరోవైపు.. శిందే సహా మరో 11 మందిపై అనర్హత వేటుకు శివసేన సిఫార్సు చేసింది.

SHINDE LETTER
ఏక్​నాథ్​ శిందే
author img

By

Published : Jun 24, 2022, 5:03 AM IST

మహారాష్ట్ర రాజకీయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గువాహటికి మరింత మంది ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​కు లేఖ రాశారు శివసేన రెబల్​ లీడర్​ ఏక్​నాథ్​ శిందే. శివసేన శాసనసభాపక్ష పార్టీ నేతగా గుర్తించాలని కోరారు. తమకు 36 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారు సంతకాలు చేసిన లేఖ కాపీలను డిప్యూటీ స్పీకర్​ నరహరి జిర్వాల్​, గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ, శాసనమండలి సెక్రెటరీ రాజేంద్ర భగవత్​లకు పంపించారు.

మరోవైపు.. శివసేన ఎమ్మెల్యే భరత్​ గోగవాలేను శాసనసభాపక్ష పార్టీ చీఫ్​ విప్​గా సునిల్​ ప్రభు స్థానంలో నియమిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు శిందే. ఈ క్రమంలో సునీల్​ ప్రభు సమావేశానికి హాజరుకాని రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవలి డిమాండ్​ చేసిన వారిపై విమర్శలు గుప్పించారు శిందే. విప్​ కేవలం శాసనసభ కార్యక్రమాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

అనర్హత వేటుకు శివసేన సిఫార్సు.. పార్టీపై తిరుగుబావుట ఎగురవేసిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు శివసేన లేఖ రాసింది. అనర్హత వేటుకు సంబంధించిన మరికొందరి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి

మరోవైపు.. శివసేన నుంచి ఒక్కొక్కరుగా రెబల్‌ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకోగా.. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు. దీంతో ఏక్‌నాథ్‌ శిందేతో కలుపుకొని మొత్తం రెబల్‌ ఎమ్మెల్యేల సంఖ్య 40కి చేరిందని సమాచారం. కాగా.. రెబల్‌ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ శిందేను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలుస్తోంది.

శివసేనకు పార్టీలో మొత్తం 55 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు (37) శిందేవైపు చేరితే.. చట్టబద్ధంగా శాసనపక్ష హోదా పొందే అవకాశం రెబల్స్‌కు లభిస్తుంది. ఇప్పటికి అసోంకు చేరుకున్న ఎమ్మెల్యేల సంఖ్యను పోల్చుకుంటే రెబల్‌ వర్గానికి మ్యాజిక్‌ ఫిగర్‌ లభించినట్లే కనిపిస్తోంది. తాజా పరిస్థితుల్లో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: పెరుగుతున్న శిందే బలం.. మరికొంతమంది ఎమ్మెల్యేలు అసోంకు..

శిందే తిరుగుబాటు సక్సెస్.. బలంగా రెబల్ క్యాంప్.. ఠాక్రేకు ఛాన్స్ ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.