ETV Bharat / bharat

7 నెలలుగా అచేతన స్థితిలో గర్భిణి.. అయినా పండంటి బిడ్డకు జన్మ - అచేతన మహిళ ఆడబిడ్డకు జననం

ఓ ప్రమాదం జరిగి తీవ్ర గాయాల పాలైన గర్భిణి.. అచేతన స్థితిలో ఉండిపోయింది. మంచానికి పరిమితమైన ఏడు నెలలకు ప్రసవించి.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

unconscious Woman gave birth to baby girl

author img

By

Published : Oct 28, 2022, 3:46 PM IST

Updated : Oct 28, 2022, 5:16 PM IST

అచేతన స్థితిలో ఉన్న మహిళ(23) పండంటి శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బులంద్​శహర్​లో జరిగింది. ఏడు నెలల క్రితం ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ.. అచేతన స్థితిలోనే ఉండిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో మహిళ గర్భవతి. ఆమెను కుటుంబ సభ్యులు ఇంతకాలం జాగ్రత్తగా చూసుకున్నారు. ఆమె దిల్లీ ఎయిమ్స్​ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఏం జరిగిందంటే
మార్చి 31న మహిళ తన భర్తతో కలిసి బైక్​పై బయటకు వెళ్లగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె హెల్మెట్​ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయం తగిలింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలు దక్కినా.. ఆమె మాత్రం అచేతన స్థితిలోనే ఉండిపోయింది. ఆమె కళ్లు తెరుస్తుందని, కానీ కదల్లేని స్థితిలో ఉందని దిల్లీ ఎయిమ్స్​ న్యూరోసర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్​ దీపక్​ గుప్తా తెలిపారు. "ప్రమాదానికి గురయ్యే సమయానికి ఆమె 40 రోజుల గర్భిణి. గైనకాలజిస్టుల బృందం పరీక్షించగా.. శిశువు ఆరోగ్యంగా ఉంది. అబార్షన్​ చేసే అవకాశం లేదు. కుటుంబ సభ్యులను సంప్రదించగా.. వారు అబార్షన్​కు ఒప్పుకోలేదు. తాజాగా ఆమెకు ప్రసవం చేయగా చిన్నారికి జన్మనిచ్చింది. మహిళ అచేతన స్థితిలో ఉండడం వల్ల పాలు ఇచ్చే ఆస్కారం లేదు. ప్రస్తుతానికి డబ్బా పాలే అందిస్తున్నాం." అని దీపక్​ గుప్తా వివరించారు. ఆమె హెల్మెట్​ ధరించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పారు. భర్తే.. ఉద్యోగం మానేసి ఇంతకాలం ఆమె బాగోగులు చూసుకున్నాడని డాక్టర్ తెలిపారు.

ఇవీ చదవండి: సమాధిలోని చిన్నారి మృతదేహం నుంచి తల మాయం.. ఆ పూజల కోసమేనా?

నదిపై వంతెన కట్టిన గ్రామస్థులు.. అధికారుల అలసత్వానికి 'శ్రమదానం'తో పరిష్కారం

Last Updated : Oct 28, 2022, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.