ETV Bharat / bharat

ఎమ్మెల్యే జిగ్నేష్​ మేవాణికి మూడు నెలల జైలు శిక్ష

JIGNESH MEVANI: గుజరాత్​ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్​ మేవాణికి మూడు నెలల జైలు శిక్ష విధించింది మోహసానా కోర్టు. ఆయనతో పాటు మరో 9 మందికి 2017 ఆజాదీ మార్చ్​ కేసులో శిక్ష ఖరారు చేసింది. కొద్ది రోజుల క్రితం మేవాణిని రెండు కేసుల్లో అరెస్ట్​ చేయగా బెయిల్​పై విడుదలయ్యారు.

MLA JIGNESH MEVANI
జిగ్నేష్​ మేవాణి
author img

By

Published : May 5, 2022, 4:44 PM IST

JIGNESH MEVANI: 2017 ఆజాదీ మార్చ్ కేసులో గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాణికి మెహసానా కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. అనుమతి లేకుండానే ఆజాదీ మార్చ్ నిర్వహించారన్న కేసులో మేవాణితో పాటు మరో 9 మందికి శిక్ష ఖరారు చేసింది. ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించింది.

2017 జులైలో బనస్‌కాంతా జిల్లాలో మెహ్‌సానా నుంచి ధనేరా వరకూ అనుమతి లేకుండానే మేవాణి ఆజాదీ మార్చ్ నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 12 మందిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. వీరిలో ఒకరు చనిపోగా మరకొరు పరారీలో ఉన్నారు. మిగతా పదిమందికి కోర్టు జైలుశిక్ష విధించింది.

అరెస్ట్​లు బెయిల్​పై హైడ్రామా?: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ జిగ్నేష్​ ఏప్రిల్​ 18న చేసిన ట్వీట్‌ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సే పేరును ప్రస్తావిస్తూ మోదీపై ఆయన చేసిన ట్వీట్‌పై కోక్రాఝర్‌ ప్రాంతంలో భాజపా నేత అరూప్‌ కుమార్‌ డే పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల కేసు నమోదైంది. అస్సోం పోలీసులు 19న రాత్రి 11.30గంటల సమయంలో గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో జిగ్నేష్​ను అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను కొక్రాఝర్‌ కోర్టులో ప్రవేశపెట్టగా.. మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం జిగ్నేష్​కు ఏప్రిల్‌ 25న బెయిల్‌ మంజూరు చేసింది. జిగ్నేష్​ గుజరాత్‌లోని వడగాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే బెయిల్‌పై విడుదలైన కొద్ది సేపటికే జిగ్నేష్​ను బార్పేట్‌ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఓ మహిళా పోలీసుపై దాడి చేశారని, అమర్యాదగా ప్రవర్తించారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై ఆయన కోర్టును ఆశ్రయించగా.. బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. అనంతరం తన అరెస్టుపై జిగ్నేష్​ విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రధాని కార్యాలయం ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే తన అరెస్టు జరిగిందన్నారు. తన అరెస్టు భాజపా, ఆరెస్సెస్‌ కుట్రగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'నా అరెస్ట్​ కోసం ప్రధాని కార్యాలయం కుట్ర.. 56 అంగుళాల పిరికితనం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.