ETV Bharat / snippets

ప్రేమ విఫలమైందని ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య - ప్రియురాలు ఏం చేసిందంటే

BOY COMMITS SUICIDE DUE TO LOVEFAI
Youth commits suicide in Nizamabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 10:16 PM IST

Youth commits suicide in Nizamabad : ప్రేమ విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది, ఓ యువకుడు తనువు చాలించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పోచారానికి చెందిన మొరే దీపక్(20) ఓ డీజే నిర్వాహకుడి వద్ద ఆపరేటర్​గా పని చేస్తున్నాడు. వ్యవసాయ కూలీ కుటుంబం వీరిది. తల్లి, సోదరుడితో కలిసి జీవిస్తున్నారు. దీపక్, అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి ప్రేమించుకుంటున్నారు. యువతి కుటుంబీకులు ప్రేమను అంగీకరించకపోవడంతో పాటు, ఇటీవల మరో యువకుడితో నిశ్చితార్థం చేశారు.

ఇది జీర్ణించుకోలేని దీపక్ ఆత్మహత్య చేసుకోవాలని గురువారం రాత్రి నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని యువతికి చరవాణి ద్వారా వివరించినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం వేళ దీపక్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వేళ యువతి కూడా ఆత్మహత్యాయత్నం చేయగా, గమనించిన కుటుంబీకులు నిజామాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.