ETV Bharat / snippets

రాజధానిలో ముగిసిన ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ బృందం పర్యటన - అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారం!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 9:29 AM IST

ADB Team and World Bank Visit Amaravati
ADB Team and World Bank Visit Amaravati (ETV Bharat)

ADB Team and World Bank Visit Amaravati : రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించేందుకు ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు రాజధానిలో ప్రాంతంలో పర్యటించిన వారు వివిధ అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. అమరావతి పరిధిలోని వివిధ కట్టడాలు, కొండవీటి వాగు, హెల్త్ సెంటర్లు, సెక్రటేరీయేట్, రోడ్లు, డక్ట్‌లు, డ్రైన్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

సీఎం చంద్రబాబుతో పాటు సీఆర్డీఏ ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించారు. భూ సమీకరణ, ఎల్పీఎస్ సహా ఇతర సామాజిక అంశాలపై ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు ఆరా తీశారు. రాజధాని పరిధిలోని అర్బన్ గవర్నెన్స్, ఆర్థిక వ్యవస్థ, వరద నిర్వహణ సవాళ్లపై తమ పర్యటనలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బృందాలు చర్చించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.