ETV Bharat / snippets

సీఐ కార్యాలయం ఎదుట మహిళ బైఠాయింపు - ఎస్సై డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ

Women Protest In Front Of CI office
Women Protest In Front Of CI office (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 7:54 PM IST

Women Protest In Front Of CI office : ఓ ఎస్సై డ్రైవర్​ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ మహిళ సీఐ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. వాణీశ్వరీ అనే బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఓ ఫిర్యాదు విషయంలో కారేపల్లి మండలం మేకల తండాలో ఎంక్వైరీ పేరుతో తన భర్త లేని సమయంలో పోలీసులు ఇంటివద్దకు వచ్చారని వాణీశ్వరి తెలిపింది. ఎస్సై డ్రైవర్​ మల్లేశం తన చేయిపట్టి లాగాడని సదరు మహిళ ఆరోపించింది.

తన చేతిలో ఉన్నసెల్​ఫోన్​ను ఎస్సై డ్రైవర్​ మల్లేశం తీసుకున్నారని వాపోయింది. కుటుంబ సభ్యులతో బాధితురాలు చేస్తున్న నిరసనతో సీఐ తిరుపతి రెడ్డి స్పందించి వారిని లోపలికి పిలిచి జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. తన ఇంటి వద్దకు ఎస్సై రాజారామ్ వచ్చారని లోపలికి వచ్చిన డ్రైవర్ మల్లేశం అసభ్యంగా ప్రవర్తించాడని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని దంపతులు సీఐని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.