Woman Commits Suicide With Children : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. రుద్రారం గ్రామంలోని ఓ మహిళ తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కాగా కుటుంబ కలహాలతోనే ఆమె ప్రాణాలు తీసుకున్నట్లుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుధాకర్, సువర్ణ(28) దంపతులు తమ ముగ్గురు పిల్లలతో గత ఏడేళ్లుగా పటాన్చెరు మండలం రుద్రారంలో నివాసముంటున్నారు. మెకానిక్‌గా పనిచేస్తున్న సుధాకర్ మద్యానికి బానిసయ్యాడు. అతని బంధువులు అతడిని రీహేబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు. ఈ క్రమంలోనే అతడి భార్య తన ముగ్గురు పిల్లలకు విషపదార్థం ఇచ్చి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనకు ముందు ఆమె రాసుకున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.