Wife Killed Husband In Miyapur : మద్యం తాగి తనతో గొడవపడుతున్నాడనే కోపంతో కట్టుకున్న భర్తనే చున్నీతో ఉరివేసి చంపింది ఓ భార్య. ఈ ఘటన హైదరాబాద్లోని మియాపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అసోం రాష్ట్రానికి చెందిన అలీ హుస్సేన్(35) రుస్తాన బేగం(30) దంపతులు హఫిజ్పేట్ ప్రేమ్ నగర్ బి బ్లాక్లో గత మూడేళ్లుగా నివాసం ఉంటున్నారు. అలీ రోజు కూలీ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే తన భర్త ప్రతి రోజూ మద్యం సేవించి వచ్చి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని రుస్తానా బేగం అతడిని చున్నీతో ఉరివేసి హత్యకు పాల్పడింది. హత్యకు గురైన అలీ అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరికి 15 ఏళ్లలోపున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య హత్య చేసినట్లు అంగీకరించడంతో రిమాండ్కు తరలించినట్లు మియాపూర్ సీఐ తెలిపారు.