ETV Bharat / snippets

అపవిత్రం చేసి మళ్లీ తిరుమల దర్శనానికి ఎందుకు? : రాజాసింగ్​

RAJASINGH WARNING TO YS JAGAN
GOSHAMAHAL MLA RAJA SINGH (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2024, 1:10 PM IST

Raja Singh On Thirupathi Temple : తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రమైందని, యావత్‌ ప్రపంచం నుంచి హిందువులు తిరుపతికి వచ్చి స్వామి వారిని దర్శింకుంటారని గోశామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల నెయ్యి కలిపారని తెలిసి చాలా మంది హిందువులు బాధపడుతున్నారన్నారు. ఇలాంటి పాపిష్టుడు ప్రపంచంలో ఉన్నాడా అనే చర్చ నడుస్తోందన్నారు. తిరుపతిని అపవిత్రం చేసిన వారు మళ్లీ దేవస్థానానికి వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు. తమ దేవుడి మీద నమ్మకం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు.

తిరుపతి దేవాలయాన్ని అపవిత్రం చేసిన వాళ్లు దర్శనం చేసుకుంటాం అంటున్నారని, ఇది సరైనదేనా అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలుగు ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారని, బాధ్యులు కంటపడితే చంపేస్తారని హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం హిందూ బోర్డు తీసుకురావాలని చెప్పిన ప్రతిపాదన మంచిదని అభిప్రాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.