ETV Bharat / snippets

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఈఎన్సీ బృందం - భారీ బుంగలపై తీసుకోవల్సిన చర్యలపై పలు సూచనలు

author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 3:14 PM IST

Kaleshwaram Lift Irrigation
ENC Anil Kumar Inspects Medigadda Barrage (ETV Bharat)

ENC Anil Kumar Inspects Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్‌ను రక్షణ, పునరుద్ధరణ, పర్యవేక్షణ, పనుల కమిటీ పరిశీలించింది. కమిటీ నిర్వాహకులు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌ కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీ పరిశీలన చేసింది. మేడిగడ్డ బ్యారేజ్‌కు చేరుకొని దెబ్బతిని, కుంగిన ఏడో బ్లాక్‌లో జరుగుతున్న గేట్ల కటింగ్, షీట్ ఫైల్స్, గ్రౌటింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బ్యారేజ్ అప్‌స్ట్రీమ్‌లోని కుంగిన 20 పియర్ ఎగువన ఏర్పడిన భారీ బుంగలను పరిశీలించి తీసుకోవల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఎల్ అండ్ టీ, ఇంజినీరింగ్ అధికారులను మరమ్మతు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కమిటీలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిపుణులు నాగేందర్ రావు, మోహన్ రామగుండం సర్కిల్ సీఈ సుధాకర్ రెడ్డిలు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.