ETV Bharat / snippets

వీఆర్ఏ ఆత్మహత్య - డిప్యూటీ ఎమ్మార్వో వేధింపులే కారణమని కుటుంబీకుల ఆరోపణ

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 5:23 PM IST

Kamareddy Crime News
VRA Suicide in Kamareddy (ETV Bharat)

VRA Suicide in Kamareddy : వీఆర్​ఏ చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రామారెడ్డి మండలం కన్నాపూర్ తండా గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం, కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన తెడ్డు ప్రసాద్(30) తాడ్వాయి ఎమ్మార్వో ఆఫీసులో వీఆర్ఏగా విధులను నిర్వహిస్తున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ప్రసాద్​ను డిప్యూటీ తహశీల్దార్ వేధింపులకు గురి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

దీంతో మనోవేదనకు గురైన ప్రసాద్, గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.