ETV Bharat / snippets

ప్రేమ జంటను వేధించిన కేసు - ఉప్పల్ సీఐపై బదిలీ వేటు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 3:38 PM IST

Uppal CI Election Reddy
Uppal CI Election Reddy (ETV Bharat)

Uppal CI Election Reddy Transferred : ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఉప్పల్​లోని హెచ్ఎండీఏ లే అవుట్​లోకి వచ్చే జంటలను పోకిరీలు బెదిరిస్తున్నారు. వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. తమను బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి న్యాయం చేయాల్సిన ఎస్సై శంకర్ పోకిరీలకు మద్దతు పలికాడు.

బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారించిన పోలీసు ఉన్నతాధికారులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై శంకర్​ను డీసీపీ ఆఫీస్​కు అటాచ్ చేయగా, తాజాగా సీఐ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ రాచకొండ సీపీ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.