ETV Bharat / snippets

ప్రతి ఇంటిపై మూడు రోజుల పాటు తిరంగా జాతీయ పతాకం ఎగురవేయాలి : కిషన్ రెడ్డి

har ghar tiranga 2024
Union Minister Kishan Reddy Started Tiranga Rally (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 2:19 PM IST

Union Minister Kishan Reddy Started Tiranga Rally in Hyderabad : దేశ సమైక్యత సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్​​లో తిరంగా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ప్రతి ఇంటిపై తిరంగా జాతీయ పతాకం ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్ఫూర్తితోనే మూడేళ్లుగా 26 కోట్ల మంది ప్రజలు ఇంటిపైన జాతీయ పతాకాలను ఎగుర వేశారని ఆయన గుర్తుచేశారు.

జాతీయ సమైక్యత కోసం ప్రధాని ఇచ్చిన ఈ పిలుపును ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. నేటి యువతరం కొత్త తరానికి స్వాతంత్ర చరిత్ర తెలియజేయాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు. ఈనెల 12, 13, 14 తేదీల్లో తెలుగు ప్రజలందరూ జాతీయ పతాకాలు ఎగురవేయాలని, 15వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే జాతీయ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.