ETV Bharat / snippets

మెగాస్టార్​ చిరంజీవిని కలిసిన బండి సంజయ్​ - కేంద్రమంత్రి ఫ్యాన్​బాయ్​ మూమెంట్​!

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 10:20 PM IST

Bandi Sanjay Meet Megastar
Union Minister Bandi Sanjay Meet Megastar Chiranjeevi (ETV Bharat)

Union Minister Bandi Sanjay Meet Megastar Chiru : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. జూబ్లిహిల్స్​లోని ఆయన నివాసానికి చేరుకున్న బండి సంజయ్​ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి తన నివాసానికి తోడ్కోని వెళ్లి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. సంజయ్, మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు. మీరు మంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అగ్రెసివ్ మెంటాలిటికి తగిన పోస్ట్ లభించింది అని చిరు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ, తాను విద్యార్ధి దశలో మెగాస్టార్​ సినిమాలకు అభిమానినని, అన్నయ్య చిరంజీవిని ఇలా కలవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్​లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఇరువురు దేశ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.