ETV Bharat / snippets

నల్గొండ యువతి ఆత్మహత్య కేసులో నిందితులు అరెస్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 4:43 PM IST

Etv BharatYoung Woman Suicide For Harassment Case Update
Suspects Arrested in Nalgonda Young Woman Suicide Case (ETV Bharat)

Suspects Arrested in Nalgonda Young Woman Suicide Case : నల్గొండ జిల్లాలో ఆకతాయిల వేధింపులకు బలైన యువతి ఆత్మహత్య కేసులో ఇద్దరు యువకులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పురుగుల మందు తాగి నల్గొండ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన యువతి, మరణ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాతో తెలిపారు.

ఇందులో భాగంగానే యువతిని వేధింపులకు గురిచేసిన అదే గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆడపిల్లలకు ఇటువంటి సమస్య ఎదురైతే ఉన్నత అధికారులకు తెలియజేయడమో చేయాలనీ లేదా పేరెంట్స్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే గోప్యత పాటించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆడపిల్లలను ఏవిధంగా ఇబ్బంది పెట్టినా చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, ఈ కేసులో కూడా అరెస్ట్ చేసిన వారిద్దరికీ కఠినశిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.