DEO Sudden Inspection at Warangal Government School : ఉపాధ్యాయుల గైర్హాజరుతో రెండు ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ పలు పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాకు చెందిన నెక్కొండ మండలంలోని అజ్మీర మంగ్య తండా పాఠశాల, గొట్లకొండ ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయులు సరిగా విధులకు హాజరు కాకపోవడంతో పాఠశాలలను మూసివేశారు. విద్యార్థులు పాఠశాలకు రాకున్న నెలవారిగా అందరు పిల్లలు హాజరైనట్లుగా బిల్లులు సమర్పిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు పాఠశాలల ఉపాధ్యాయులపై శాఖా పరమైన చర్యలకు తీసుకోనునట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు.
స్కూళ్లకు పిల్లలు రాకున్నా పూర్తి బిల్లులు - విద్యాధికారి ఆకస్మిక తనిఖీ - ఆపై?
Published : Sep 14, 2024, 1:52 PM IST