TS Polycet Counselling Schedule Release : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. పాలిసెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయించనున్నారు. రెండు దశల్లో కౌన్సెలింగ్ చేపట్టనుండగా, తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 22న వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, జూన్ 30న తొలి విడత సీట్లు కేటాయించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇక జులై 7 నుంచి తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభించి, జులై 13న సీట్ల కేటాయింపు పూర్తి చేయనుంది. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్కు అవకాశం ఇచ్చారు. జులై 24న తుది విడత సీట్లు కేటాయింపు, జులై 23న పాలిసెట్ ప్రవేశాల మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది - ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి
Published : May 24, 2024, 5:22 PM IST