ETV Bharat / snippets

సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం- ముగ్గురి దుర్మరణం

ROAD ACCIDENT AT RAIPOL IN SIDDIPET
Three people died in road accident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 7:13 PM IST

Three people died in road accident : సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. రాయపోలు మండలం గుర్రాలసోఫా కూడలి వద్ద కంకులు తరలిస్తున్న డీసీఎం అదుపుతప్పి, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అక్కడికక్కడే ద్విచక్ర వాహనదారులు ఇద్దరు మృతి చెందగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే డీసీఎం డ్రైవర్ మృత్యువాతపడ్డాడు.

తొగుట సిఐ లతీఫ్ తెలిపిన వివరాల ప్రకారం, మాచినపల్లి గ్రామానికి చెందిన వంశీ (19), నవీన్ (20) వ్యక్తిగత పనుల నిమిత్తం గజ్వేల్ పట్టణానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. మార్గమధ్యంలో ద్విచక్ర వాహనానికి ఎదురుగా గజ్వేల్ పట్టణం నుంచి మెదక్ జిల్లా చేగుంటకు మొక్కజొన్న కంకులను తరలిస్తున్న డీసీఎం అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. అలాగే ఎదురుగా వస్తున్న మరో లారీని సైతం ఢీ కొట్టి బోల్తా పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.