ETV Bharat / snippets

స్టీరింగ్​ విరిగి - బస్సు అదుపు తప్పి - కొంచమైతే ప్రాణాలు 'గాల్లో' కలిసిపోయేవి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 11:02 AM IST

Piramal Company Bus In Zaheerabad
Bus out of Control in Sangareddy District (ETV Bharat)

Bus out of Control Incident: సంగారెడ్డి జిల్లాలోని పిరామల్ పరిశ్రమకు చెందిన బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా స్టీరింగ్​ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పింది. జహీరాబాద్​లోని రాంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్​పై ఉన్న రేలింగ్​ను ఢీకొట్టి సగం వరకు బస్సు ముందుకు దూసుకెళ్లింది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం దిగ్వాల్‌లోని పిరామల్‌ పరిశ్రమకు చెందిన ఈ బస్సు గురువారం జహీరాబాద్‌లో 12 మంది ఉద్యోగులతో బయలుదేరింది.

రాంనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వరకు రాగానే బస్సు స్టీరింగ్‌ విరిగి అదుపు తప్పి, వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టి బస్సు ముందుభాగం కొంత వరకు దూసుకెళ్లి ఆగడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఉద్యోగులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో జహీరాబాద్‌-తాండూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.