Heavy public At Registration Center in Karimanagar : ఆగస్టు నుంచి వ్యవసాయ, వాణిజ్య భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయంటూ వస్తున్న పుకార్లు నమ్మి పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనాలు పోటెత్తారు. కరీంనగర్ జిల్లాలో భూముల క్రయ, విక్రయదారుల వరుస కట్టారు. ప్రస్తుతం అమలవుతున్న ఛార్జీల్లోనే ఆస్తి బదలాయింపు చేసుకుందామనే యోచనలో ఉన్నారు. దీంతో జులై నెల చివరి రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరిగింది.
మరోవైపు రిజిస్ట్రేషన్ సర్వర్ పనిచేయకపోవడంతో డాక్యుమెంట్లు పేరుకు పోతున్నాయి. సాధారణంగా రోజుకు 30 రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తారు, కానీ ప్రస్తుతం రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు స్లాట్లు బుక్ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్‌కు వచ్చే సరికి 60 పూర్తవుతుండగా మిగతావారు వెనుదిరుగుతున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారన్న వార్త వాస్తవం కాదని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.