ETV Bharat / snippets

లారీని ఢీకొట్టి - ఆపై ఆటోపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - పలువురికి గాయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 11:49 AM IST

Karimnagar Bus Accident
Lorry and Bus Crash in Karimnagar (ETV Bharat)

Karimnagar Bus Accident Today : కరీంనగర్‌ శివారు ప్రాంతంలోని బొమ్మకల్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటోను ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. బొమ్మకల్ ఫ్లైఓవర్‌ వద్ద ఎడమ వైపు ఉన్న గోదాములోకి లారీ మళ్లుతున్న క్రమంలో మంచిర్యాల నుంచి కరీంనగర్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఎడమవైపు నుంచి ఓవర్‌ టేక్ చేయడానికి యత్నించింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది.

ఇదే క్రమంలో ఎడమ వైపు బస్సును తిప్పేందుకు డ్రైవర్‌ యత్నించగా, అటువైపు నుంచి విద్యార్థులతో వస్తున్న ఆటోను ఢీకొంది. అందులో పాఠశాలకు వెళుతున్న ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ఉదయం వేళ కావడంతో ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో చాలా సేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.