ETV Bharat / snippets

అమెరికాలో దుండగుడి కాల్పులు - తెలుగు యువకుడి దుర్మరణం

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 10:51 AM IST

Updated : Jun 23, 2024, 11:30 AM IST

SHOOTING IN AMERICA YOUTH DIED
SHOOTING IN AMERICA YOUTH DIED (ETV Bharat)

Shooting In America Youth Died : అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే, కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ ఉపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం ఆర్కెన్సాస్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో పని చేస్తున్నాడు.

శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా, ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో గోపీ కృష్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు షాప్​లోని ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత గోపీకృష్ణను స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

Last Updated : Jun 23, 2024, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.