ETV Bharat / snippets

తెలంగాణ పాలిసెట్​ 2024 ఫలితాలు వచ్చేశాయ్ - మీ రిజల్ట్స్​ చూసుకున్నారా?

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 1:09 PM IST

Updated : Jun 3, 2024, 2:19 PM IST

Telangana Polycet Results
TG Polycet Results (ETV Bharat)

TG Polycet Results 2024 : పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు రిజల్ట్స్​ వచ్చేశాయి. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా బోర్డు ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో 84.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. ఈ మేరకు 69,752 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. మే 24న జరిగిన పాలిసెట్ పరీక్షకు మొత్తం 92,808 మంది దరఖాస్తు చేసుకోగా, 82,809 మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్​ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ఈ ఫలితాల ద్వారా ప్రవేశాలు కల్పించనున్ననట్లు చెప్పారు. పరీక్ష జరిగిన 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఎంపీసీ, ఎంబైపీసీ విభాగాల్లో తొలి మూడు ర్యాంకులు సాధించిన వారి పేర్లను బుర్రా వెంకటేశం ప్రకటించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Jun 3, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.