ETV Bharat / snippets

సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోద ముద్ర

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 7:28 PM IST

KTR on Civil Court Bill in Telangana
KTR on Civil Court Bill in Telangana (ETV Bharat)

KTR on Civil Court Bill in Telangana : సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టగా విపక్షాలు మద్దతివ్వడంతోపాటు ప్రభుత్వానికి పలు సూచనలు చేశాయి. బిల్లుపై చర్చలో పాల్గొన్న కేటీఆర్‌ కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని, కొత్త చట్టాల్లో కొన్నింటి వల్ల పోలీస్‌ రాజ్యం అవుతుందన్న ఆందోళన నెలకొందన్నారు.

సామాజిక మాధ్యమాలకు సంబంధించి కూడా కేంద్రం కొత్త చట్టం తీసుకొస్తారని అంటున్నారని, భావ ప్రకటన స్వేచ్చకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరమూ కలిసి నిరోధించాలని కేటీఆర్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. సభ్యులు లేవనెత్తిన అంశాలకు స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి, అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి ఎలాంటి చర్యలకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.