IAS Officers Appointed as Special Officers to Joint Districts : ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ప్రత్యేక అధికారులు జిల్లాలో పర్యటించి అక్కడి కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలని ఉత్తర్వుల్లో సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలకు ఐఏఎస్ లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇలంబర్తి ఉమ్మడి కరీంనగర్‌కు ఆర్.వి.కర్ణన్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనిత రామచంద్రన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎ.శరత్ ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు డి.దివ్య, ఉమ్మడి మహబూబ్ నగర్‌కు రవి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు టి.వినయ్ కృష్ణారెడ్డి, ఉమ్మడి మెదక్‌కు హరిచందన, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సురేంద్ర మోహన్, హైదరాబాద్‌కు ఆమ్రపాలి స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.