ETV Bharat / snippets

లబ్ధిదారులకు అలర్ట్ - గృహజ్యోతి పథకంలో సవరణకు అవకాశం

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 10:11 AM IST

Gruha Jyothi Scheme Update
Gruha Jyothi Scheme Update (ETV Bharat)

Gruha Jyothi Scheme Update : గృహజ్యోతి పథకంలో లోపాల సవరణలకు, దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీజీఎస్​పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు. నల్గొండ రూరల్‌ మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో గృహజ్యోతి పథకం లబ్ధిదారుల వివరాల నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో వినియోగదారులు అందజేసిన దరఖాస్తుల్లో విద్యుత్‌ కనెక్షన్‌ నంబరును తప్పుగా నమోదు చేసినవారికి సవరణ అవకాశం కల్పించి జీరో బిల్లులు జారీ చేస్తామని వెల్లడించారు.

గృహజ్యోతి పథకం కింద అర్హలైన వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లబ్దిదారులు ఇళ్లు మారినప్పుడు, ఆహారభద్రత కార్డు, సర్వీస్ కనెక్షన్ అనుసంధానం లోపాలతో పథకం లబ్ది పొందలేకపోతున్నారు. ఆ విషయం ప్రభుత్వం దృష్టికి రావడం సహా వివిధ వర్గాల నుంచి అందుతున్న అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పథకంలో సవరణలు, దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.