CBI To Probe UPSC Aspirants Death: దిల్లీలోని ఓ ఐఏఎస్ స్టడీ సెంటర్లో ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతిచెందిన కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు దిల్లీ హైకోర్టు తెలిపింది. ఘటన తీవ్రత, అవినీతి అధికారుల పాత్ర ఉండే అవకాశం ఉన్న కారణంగా, దర్యాప్తులో ప్రజలకు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దర్యాప్తు పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా దిల్లీ పోలీసులు, మున్సిపల్ అధికారులు చెప్పిన సమాధానాలపై హైకోర్టు మండిపడింది. ఈ కేసులో ఎస్‌యూవీ డ్రైవర్‌ను అరెస్టు చేయడంపైనా అసహనం వ్యక్తం చేసింది. "ఇంకా నయం, ఘటనాస్థలిలో వాహనం నడిపినందుకు కారు డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లుగా, బేస్‌మెంట్‌లోకి వరద వచ్చిందని చెప్పి వర్షపు నీటికి చలాన్ వేయలేదు' అంటూ అధికారుల తీరుపై పెదవి విరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సివిల్స్ అభ్యర్థులు స్వాగతించారు.
'ఇంకా నయం, వర్షపు నీటికి చలాన్ వేయలేదు'- CBIకి దిల్లీ IAS స్టడీ సెంటర్ కేసును అప్పగించిన హైకోర్టు
Published : Aug 2, 2024, 10:34 PM IST