ETV Bharat / snippets

చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్​ - పతకానికి ఇంకొక్క అడుగే

author img

By ETV Bharat Sports Team

Published : Aug 2, 2024, 10:37 PM IST

source Associated Press
Paris Olympics 2024 Lakshya Sen (source Associated Press)

PARIS OLYMPICS 2024 LAKSHYA SEN : భారత స్టార్ ప్లేయర్​ లక్ష్య సేన్​ పారిస్ ఒలింపిక్స్ 2024లో చరిత్ర సృష్టించాడు. పతకం దిశగా మరో అడుగు ముందుకేశాడు. తాజాగా బ్యాడ్మింటన్ మెన్స్​ సింగిల్స్​లో సెమీఫైనల్స్​కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్​లో తైవాన్‌కు చెందిన 12 సీడ్‌ ఆటగాడు చో చెన్‌పై 19-21, 21-15, 21-12 తేడాతో నెగ్గాడు. తద్వారా ఒలింపిక్స్​లో సెమీఫైనల్​కు చేరిన తొలి భారత మేల్ బ్యాడ్మింటన్​ ప్లేయర్​గా నిలిచాడు. దీంతో క్రీడాభిమానులు టేక్​ ఏ బౌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లక్ష్యసేన్‌ దూకుడు చూస్తుంటే ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేలా కనిపిస్తుందని అంటున్నారు.

ఈ క్వార్టర్‌ ఫైనల్లో తొలి సెట్‌ ఓడిపోయిన లక్ష్యసేన్​ అద్భుతంగా పుంజుకుని ముందుకు సాగాడు. తైవాన్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చౌ టియాన్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. అలా తర్వాత రెండు సెట్లను దక్కించుకుని సెమీ ఫైనల్లో అడుగుపెట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.