గణనాథునికి ఒకేసారి 21 వేల మంది విద్యార్థుల ప్రార్థన - ముక్తకంఠంగా 'అథర్వ స్త్రోత్ర' పారాయణం - Ganesh Chaturthi 2024

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 1:13 PM IST

thumbnail
Pune Ganesh Festival Celebration (ANI)

Pune Ganesh Festival Celebration : మహారాష్ట్రలోని పుణెలో గణేశ్‌ నవరాత్రి వేడుకలు అత్యంత కోలాహలంగా సాగుతున్నాయి. గణేశ్​ ఉత్సవాల్లో భాగంగా శ్రీమంత్ భావూసాహెబ్​ రంగరి మండపంలో సంబరాలు  అంబరాన్నంటాయి. మూడో రోజు 21 వేల మంది విద్యార్థినులు కలిసి విఘ్నేశ్వరుని ముందు 'అథర్వశీర్ష' పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన బాలికలు పాల్గొన్నారు. మండపం అంతా వినాయకుడి నామస్మరణతో మారుమోగుపోయింది.

గణపయ్యకు ఒకేసారి 42వేల మంది మహిళల హారతి - గిన్నిస్ రికార్డు సొంతం!
ఇదిలా ఉండగా గణేశ్ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీమంత్ దగ్దుసేత్ హల్వాయి గణపతి ఆలయంలో హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 42 వేల మంది మహిళలు పాల్గొన్నారు. వినాయకుడిని స్మరించుకుంటూ గణపతి బప్పా మోరియా అని నినాదాలు చేశారు. ఇది రికార్డు అని నిర్వాహకులు తెలిపారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారు ఈ ఘనతను గుర్తించి ధ్రువపత్రం అందజేసినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.