CM Revanth Reddy on HYDRA : హైదరాబాద్‌లో అక్రమాల నివారణకే హైడ్రా తెస్తున్నామని, దీని పరిధి 2వేల కిలోమీటర్లకు విస్తరించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైడ్రాపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎస్‌వోటీ, గ్రేహండ్స్ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో ఇంటి నెంబర్లు మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకే సంస్కరణలు తెస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్ ఓఆర్‌ఆర్ నిర్మిస్తే కొందరు దాన్ని తాకట్టు పెట్టారని, ఓఆర్‌ఆర్‌ను తాకట్టు పెట్టిన వారు సభ నుంచి పారిపోయారని విమర్శించారు.
హైదరాబాద్‌లో సరస్సులు మాయమవుతున్నాయని నాలాల కబ్జాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోందని రేవంత్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు జలాల తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రూ.6వేల కోట్ల ప్రతిపాదనలు ప్రధాని, జలశక్తిశాఖ మంత్రికి ఇచ్చామన్నారు. గతంలో రాత్రి 11 తర్వాత విచ్చలవిడిగా గంజాయి దొరికేదని ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవరికైనా గంజాయి అమ్మే దమ్ముందా అని ప్రశ్నించారు. పబ్బు, ఫామ్‌హౌస్‌ల్లో డ్రగ్ రాకెట్లతో ఎవరికి సంబంధం ఉందో చర్చించే దమ్ముందా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు సభలో ఉన్నప్పుడు డ్రగ్ రాకెట్లపై చర్చకు సిద్ధమని వ్యాఖ్యానించారు. తమకు అందరి జాతకాలు తెలుసని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున కొన్ని అంశాలపై చర్చించట్లేదని అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Minister Ponnam On HYDRA : తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా హైడ్రాకి అంకురార్పణ చేసినట్లు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నగరంలో ఉన్న కోటి 25 లక్షల జనాభాకు అనుగుణంగా ముఖ్యమంత్రి 3 అంశాలను తీసుకున్నట్లు వివరించారు. హైడ్రాకి చెంది ఏం సలహాలు ఇచ్చిన స్వీకరిస్తామని తెలిపారు. బీజేపీ సభ్యులు హైదారాబాద్ నగరానికి కేంద్రం నుంచి తెచ్చే నిధులు అంశంపై కూడా మాట్లాడాలని పిలుపునిచ్చారు.
గతంలో హైదారాబాద్‌కి సంబంధించి గోదావరి, కృష్ణ ఫేజ్ -1 ,ఫేజ్ -2 , మంజీర , హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ డ్రింకింగ్ వాటర్ పై ఏం నిర్ణయం తీసుకున్న అది కాంగ్రెస్ ప్రభుత్వాలే తీసుకున్నాయన్నారు. రింగ్ రోడ్డు, ఉస్మానియా , గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందన్నారు. హైదరాబాద్‌లో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని అక్కడ నుంచి త్వరగా వరద నీరు వెళ్లేలా ప్రభుత్వ స్థలాలను ఉపయోగించుకొని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నగరంలో 75 శాతం పైగా కుక్కలకు స్టెరిలైజేషన్ జరిగిందని సీఎం కుక్కలపై రివ్యూ చేసి ఏబీసీ కమిటీనీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎన్జీవోలతో కలిసి కుక్కలను కంట్రోల్ చేస్తున్నామన్నారు. ఆస్పత్రులలో రాబీస్ ఆంటీ వాక్సిన్ కొరత లేకుండా చూస్తున్నామన్నారు.
హైడ్రా విధివిధానాలు ఖరారు - ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు - HYDRA for Disaster Management
సీఎం రేవంత్ రెడ్డి నయా అస్త్రం 'హైడ్రా' - దీని గురించి మీకు తెలుసా? - HYDRA for Disaster Management