Prahari Clubs Formed in High Schools to Combat Drug Abuse : డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూళ్లలో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో మాదకద్రవ్యాల విక్రయాలు జరగకుండా, విద్యార్థులు వాటి బారిన పడకుండా ప్రహరీ క్లబ్‌లు నిఘా పెడతాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపల్ ప్రహరిక్లబ్కు నేతృత్వం వహిస్తారు. సీనియర్ లేదా విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండే ఓ ఉపాధ్యాయుడు, తల్లిదండ్రుల నుంచి ఒకరు, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు.
ఆరు నుంచి పది వరకు ఒక్కో తరగతి నుంచి ఒక విద్యార్థి కూడా దీనిలో సభ్యులుగా ఉంటారు. విద్యా సంస్థల్లోకి మత్తు పదార్థాలకు చేరకుండా, విద్యార్థులు ఊబిలో చిక్కుకోకుండా అవసరమైన ప్రణాళికలు ప్రహారీ క్లబ్‌లు చేస్తాయి. ప్రస్తుతానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ ప్రహరీక్లబ్స్ ఏర్పాటు చేయనున్నారు.