Two Days Holidays in Telangana: తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ నెలలో రెండు రోజులను సెలవు దినాలుగా ప్రకటించింది. సెప్టెంబర్ 7, 17వ తేదీలను సర్కారు సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా ఇది వరకే ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 7వ తేదీన గణేష్ చతుర్థి.. 16వ తేదీన మిలాద్ ఉన్ నబీ సెలవుగా అధికారిక క్యాలెండర్‌లో ప్రకటించింది. కానీ.. మిలాద్ ఉన్ నబీ పండగను నెలవంక దర్శనం తర్వాత జరుపుకుంటారు కాబట్టి.. అందుకు అనుగుణంగా సెలవు తేదీని మార్చుతున్నట్టు తాజా ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది. దీని ప్రకారం.. 7వ తేదీన వినాయక చవితి, 17న మిలాద్ ఉన్ నబీ సెలవుగా ప్రభుత్వం డిక్లేర్ చేసింది.
విద్యార్థులకు గుడ్‌న్యూస్ - ఆ రెండు రోజులు సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం!
Published : Sep 5, 2024, 2:32 PM IST