ETV Bharat / snippets

ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 4:53 PM IST

TELANGANA ASSEMBLY SESSIONS
TELANGANA ASSEMBLY SESSIONS (ETV Bharat)

Telangana Assembly Monsoon Sessions From July 24th : ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖాధికారులతో సమీక్షంచారు. ఈ సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు. సమావేశ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ స‌మావేశాల్లో పూర్తి స్థాయి బ‌డ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉండ‌టంతో ఆర్థిక శాఖ అధికారుల‌తో కూడా స్పీక‌ర్ చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. కేంద్రంలో బ‌డ్జెట్ ప్రవేశ పెట్టిన త‌రువాత‌నే రాష్ట్రంలో బ‌డ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో అందుకు త‌గ్గట్లు అధికారులు సిద్ధం కావాల‌ని సూచించార‌ని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.