ETV Bharat / snippets

నేడు శాసనసభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 8:08 AM IST

Skill University Bill in  Assembly
TG Assembly Session (ETV Bharat)

TG Assembly Session on Skill University Bill : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లు మంగళవారం శాసనసభ ముందుకు రానుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు- 2024ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పద్దులపై శాసనసభలో మంగళవారం చివరి రోజు చర్చ జరగనుంది. మరో 19 పద్దులపై అసెంబ్లీలో చర్చించనుండగా మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. వ్యవసాయం, నీటిపారుదల, పంచాయితీ రాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, సంక్షేమ శాఖ పద్దులపై చర్చ జరగనుంది. మంగళవారం సైతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.