Sandeep Sandilya Tenure Extension : తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యను ప్రభుత్వం పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 31తో ఆయన పదవీ కాలం ముగియగా, మళ్లీ అదే స్థానంలో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు
తాజా ఉత్తర్వులతో సందీప్ శాండిల్య మరో ఏడాది పాటు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ స్థానంలో కొనసాగనున్నారు. ఇటీవల టీజీ న్యాబ్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ కట్టడి కోసం ఏర్పాటైన టీజీ న్యాబ్ పని తీరును ఆయన మెచ్చుకున్నారు.